ఈ వార్త వింటే భార్యలంతా తాము చనిపోయాక తమకి ఇలాగే చేయమని అడుగుతారేమో

updated: February 24, 2018 14:10 IST

గుడులకు మనదేశంలో అసలు లోటు లేదు...కేవలం పూజించే దేవుళ్లకే కాక... సినిమా నటులు, రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులకు అక్కడక్కడా ఆలయాలు నిర్మించిన ఘటనలున్నాయి. అయితే భార్యకు గుడి కట్టిన వారు మాత్రం అరుదే.

భార్య చనిపోయి ఆమె కర్మకాండలు జరుగక ముందే మళ్లీ పెళ్లి కోసం మంతనాలు సాగించే మహానుభావులు ఉన్న ఈ రోజుల్లో, అలాగే భార్య బతికి ఉండగానే నరకాన్ని చూపిస్తున్న ప్రభుద్దులు ఉన్న  ఈ దేశంలో....   వారందరికీ  విరుద్ధంగా చనిపోయిన భార్య కోసం గుడికట్టించాడో  రైతు. ప్రతీ రోజు భార్య గుడి  దగ్గర పూజలు చేసి ఆమె ప్రేమను రైతు పొందుతున్నాడు.    ఈ  రైతు విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్‌ జిల్లాకు చెందిన ఓ రైతు.. మరణించిన తన భార్యకు గుడికట్టి, 12 ఏళ్లుగా నిత్యపూజలు చేస్తున్నారు. యల్లందూరు తాలూకా కృష్ణాపురానికి చెందిన రాజుస్వామి అలియాస్‌ రాజు తల్లిదండ్రులను ఎదిరించి స్వయానా తన అక్క కూతురు రాజమ్మను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా జీవించేవారు. గ్రామంలో దేవుడి గుడి నిర్మించాలని ఆమె తరచుగా భర్తను కోరేది. ఇందుకు రాజు సిద్ధమైన తరుణంలో.. రాజమ్మ మృతిచెందింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులు వ్యతిరేకించినా.. భార్య కోరిక మేరకు 2006లో కృష్ణాపురంలో సొంత ఖర్చులతోనే.. గుడి కట్టి అందులో దేవుడి విగ్రహాన్ని బదులు... ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. 
గతంలోనూ తిరుపతికి చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి తన బార్యకు ఇలాగే గుడి కట్టించి వార్తల్లో నిలిచారు. ఇవన్నీ చూస్తూంటే ముంతాజ్ కోసం షాజహాన్ .. తాజ్ మహల్  కట్టించినట్లు ... బార్యలు తాము చనిపోయాక ఓ గుడి కట్టమని భర్తలను కోరుతారేమో రాబోయే రోజుల్లో.  

comments